పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నతుమ్మ
ఢిల్లీలో పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్డు వెంట నాటిన 'తుమ్మ (ప్రొసోపిస్ జులిఫ్లోరా)' మొక్కలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించిన ఈ మొక్కలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢి ల్లీలో 7,777మొక్క లు నాటారని, ఇవి పెరుగుతున్న ప్రాంతంలో ఇతర వృక్షజాతులు మనుగడ సాగించడం లేదని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డీగ్రేడెడ్ ఎకోసిస్టమ్స్(సీఈఎండీఈ)కి చెందిన ప్రొఫెసర్ సీఆర్ బాబు వెల్లడించారు. ' చెట్ల వేర్లు దాదాపు 21మీటర్ల లోతు మేరకు భూమిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వర్షపు నీరు లోపలికి వెళ్లడం సాధ్యం కాదు. ఈ మొక్క సమీపంలోని నేలలో భూసారం, తేమ తగ్గుతుంది'అని అంటారాయన. వీటి ఆకుల్లో ఒక రకమైన రసాయనం ఉండడం వల్ల అవి మండే స్వభావం కలిగి ఉండడంతో పాటు త్వరగా కుళ్లిపోయే అవకాశముండదని నిపుణులు చెబుతున్నారు. తుమ్మ వల్ల కలిగే హాని గురిం చి తెలుసుకోవడానికి గుజరాత్ పర్యావరణ శాఖ కచ్ ప్రాంతంలో నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈజాతికి చెందిన మొక్కలు ఎదుగుతున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం, ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. తుమ్మ మొక్కలు దట్టంగా ఉండి అధికభాగాన్ని ఆక్రమించడం వల్ల నేలపై వెలుతురు ప్రసరించే వీలుండడం లేదని కనుగొన్నారు. తుమ్మ మొక్కలు నాటిన తరువాత కచ్ ప్రాంతంలో ఒక పక్షి కూడా కనపడలేదంటే వీటి ప్రభావం ఎలా ఉంటుం దో సులభంగానే గ్రహించవచ్చు. వీటిని తినడం వల్ల అక్కడ భారీ సంఖ్యలో పశువులు మరణించాయి. ప్రభుత్వం ఏమంటోంది ? ఈ విషయమై పర్యావరణశాఖ సీనియర్ సైంటిఫిక్ అధికారి డాక్టర్ బీ.సీ. సబత్ స్పందిస్తూ ఈమొక్కలను ధ్వంసం చేసి వీటి స్థానంలో కొత్తవి నాటడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.
0 Responses to "పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నతుమ్మ"
Post a Comment