భూమాత గొడుగును కాపాడుకుందాం
భూమాత గొడుగును కాపాడుకుందాం
సెప్టెంబరు 16 ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
'ప్రకృతికి మన అవసరాలు తీర్చగల స్థోమత ఉంది. కానీ.. పెరుగుతున్న జనం అత్యాశను మాత్రం తీర్చలేదు' - గాంధీజీ
'ప్రకృతితో సహజ జీవనం తల్లీబిడ్డల బంధం. ఆధునిక పరిజ్ఞానంతో సహజమైన పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తూ మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కుంటున్నాం' - పర్యావరణవేత్తలు
అందమైన జలపాతాలు.. అరుదైన జీవజాతులు.. ప్రకృతిలోని ప్రతి అణువూ మనసును పులకింపజేసేవే. అయితే అవన్నీ కాలగర్భంలో కలసి పోయే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంది. భావి తరాలకు సంపద సృష్టించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమించే మనిషి.. ఆరోగ్యకరమైన ప్రకృతిని ఇచ్చే విషయాన్ని మరుస్తున్నాడు. సాంకేతిక ముసుగులో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కంటిపాపలా సంరక్షిస్తున్న ఓజోన్ పొరను మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. తద్వారా మనతోపాటు జీవజాలం ప్రకృతి సంపదను కాలగర్భంలో కలిపేస్తున్నాం. బుధవారం అంతర్జాతీయ 'ఓజోన్ పరిరక్షణ' దినోత్సవం. ఈ సందర్భంగా ఓజోన్ పొర ప్రాధాన్యాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, మన కర్తవ్యాలను ఓసారి పరికిద్దాం.
ఓజోన్ పొరకు ఏర్పడిన చిల్లులు మానవాళికి తెచ్చే పెనుప్రమాదం గుర్తించిన ఐరాస 1987 సెప్టెంబరు 16న కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచ సదస్సు నిర్వహించింది. మోక్ట్రియల్ ప్రోటోకాల్‌ను ఖరారుచేసింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 16ను పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు.
ఏమిటీ ఓజోన్
భూమికి 15-25 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఓజోన్ పొర ఉంటుంది. ఇది మానవాళికి రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణానికి ప్రాముఖ్యతనిచ్చింది. అప్పట్లో లక్షలాది మందిని బలిగొన్న మలేరియా మహమ్మారిని అదుపు చేసేందుకు డీడీటీ విచ్చలవిడిగా వాడారు. దోమల నాశకానికి వినియోగించిన ఈ మందు ప్రభావంతో పర్యావరణానికి మేలు చేకూర్చే వందలాది క్రిమికీటకాలు, పక్షులు అంతరించాయి. జీవ వైవిధ్యం సమతుల్యం కోల్పోయింది.
కారణాలు
భారత్‌లో..

- సూర్యుని నుంచి వచ్చే కిరణాల్లో అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. వీటిలో అల్ట్రావయొలెట్ బి రేడియేషన్, అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ అని రెండు ఉంటాయి.
- అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ చాలా ప్రమాదకరమైంది. సూర్య కిరణాలు భూమికి చేరుకునే ప్రయాణంలో సి రేడియేషన్‌ను ఓజోన్ పొర పూర్తిగా అడ్డుకుంటుంది. బి రేడియేషన్‌ని వీలైనంత తగ్గిస్తుంది.
- ఓజోన్ పొర ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లు నార్వే ప్రధాని గ్రోహార్లెన్ ఆధ్వర్యంలోని కమిషన్ 1987లో ఐరాసకు నివేదిక సమర్పించింది.
- దక్షిణధ్రువం, ఉత్తరధ్రువం దగ్గర ఓజోన్ పొర దెబ్బతిన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
- యూరప్ కెనడాల్లో ఈ తీవ్రత అధికంగా ఉంది. దీని ప్రభావం పిల్లలపై పడకుండా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పాఠశాల్లో పిల్లల్ని బయటకు రానీయవద్దని ఆంక్షలు కూడా విధించారు. ఒకవేళ బయటకు వచ్చినా ఈ కిరణాల నుంచి కాపాడే తొడుగులు, లేపనాలు వినియోగించేవారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణానికి ప్రాముఖ్యతనిచ్చింది. అప్పట్లో లక్షలాది మందిని బలిగొన్న మలేరియా మహమ్మారిని అదుపు చేసేందుకు డీడీటీ విచ్చలవిడిగా వాడారు. దోమల నాశకానికి వినియోగించిన ఈ మందు ప్రభావంతో పర్యావరణానికి మేలు చేకూర్చే వందలాది క్రిమికీటకాలు, పక్షులు అంతరించాయి. జీవ వైవిధ్యం సమతుల్యం కోల్పోయింది.
కారణాలు
- క్లోరోఫ్లోరో కార్బన్స్ (సీఎఫ్‌సీ) అనే వాయువు ఓజోన్ పొర క్షీణతకు కారణం. ఏసీ, ఫ్రిజ్‌లు వంటి వాటి నుంచి ఇది విడుదలవుతుంది.
- మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, రసాయన వ్యర్థాలు కూడా విఘాతం కలిగిస్తున్నాయి.
- అమెరికా సహా 12 యూరప్‌దేశాలు ప్రపంచం మొత్తమ్మీద మూడు వంతుల సీఎఫ్‌సీ విడుదల చేస్తున్నాయి.
- రసాయనక ఎరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్‌లు ఓజోన్‌పొరను తినేస్తున్నాయని 1970ల్లో పాల్ క్రటజన్ హెచ్చరించారు.
- ఓజోన్ పొరను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు నిషేధించిన కొన్ని రకాల గ్యాస్‌లు, వాయువుల వల్ల రెండేళ్లుగా ఓజోన్ స్థితి కొద్దిగా కుదుటపడ్డట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
- పర్యావరణం, ఓజోన్‌పై ప్రభుత్వాలు అవగాహన పెంపొందించాలి. స్థానికంగా సదస్సులు నిర్వహించాలి.
- ఫ్రియాన్, సీఎఫ్‌సీల వాడకాన్ని ఆరికట్టాలి
- ప్రత్యామ్నాయంగా వచ్చిన వస్తువులను ఉపయోగించాలి
- ఓజోన్‌కు నష్టం కలిగించే పరిశ్రమలను క్రమంగా నిషేధించాలి.పచ్చదనాన్ని పెంపొందించాలి.
- ఇంటి కప్పు.. బీటలు వారితే.. ఎండకు ఎండుతూ వానకు వానకు తడుస్తూ ఉండగలమా! భూమిని సంరక్షించే గొడుగు(ఓజోన్) క్షీణించడం వల్ల అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఎదురవుతోంది.
- భూతాపం, రుతుపవనాలు గతి తప్పడానికి ఇదే కారణం
- మానవుల్లో చర్మ క్యాన్సర్, వాధ్యి నిరోధక శక్తి క్షీణించడం, కంటి శుక్లాలు వంటి భయంకర ఇక్కట్లు తలెత్తుతాయి.
- వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని పంట దిగుబడులు తగ్గిపోతాయి.
భారత్‌లో..
- ఆరేళ్ల కిందట ఐఐటీ కాన్పూర్, అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ వర్సిటీ భారతదేశంలో ఓజోన్ పొరలో వచ్చిన మార్పుల్ని రెండు ఉపగ్రహాల సాయంతో పరిశోధనలు జరిపాయి.
- ఓజోన్ పొర మందాన్ని డాబ్సన్ యూనిట్ల(డీయూ)లో కొలుస్తారు. సాధారణంగా ఈ పొర 300 నుంచి 500 డీయూల మందం కలిగి ఉంటుంది. గంగానదీ పరివాహ ప్రాంతాల్లోని పట్టణాలైన కాన్పూర్, కొల్‌కతా, పాట్నా, వారణాసిల్లో ఉండాల్సిన మందంతో పోలిస్తే 12.6, 10.8, 13.5, 11.3 డీయూలు తగ్గినట్లు అంచనా వేశారు.
0 Responses to "భూమాత గొడుగును కాపాడుకుందాం"
Post a Comment