గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి
విద్యుత్తు పొదుపుతో పాటు భూతాపానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందరూ ఇళ్లల్లో ఉన్న విద్యుత్తు దీపాలు ఆర్పి ఉద్యమానికి చేయూతనివ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాఘవేందర్ కోరుతున్నారు. ముంబయిలో డిసెంబర్ 15న నిర్వహించిన 'బత్తీ బంద్' కార్యక్రమమే తమకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నగరంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న యువత రాఘవేందర్, మోహన్, మధుకర్, రజిత, పుష్కర్, సంపత్, షవాలీ నడుం బిగించారు. వీరంతా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు. ఏదైనా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఉద్యమం. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ, నెడ్‌క్యాప్ తదితర సంస్థలూ సహకరిస్తున్నాయి. వివరాలకు 99088 15490లో సంప్రదించవచ్చన్నారు.
0 Responses to "గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి"
Post a Comment