సెల్‌లో విద్యుత్తు బిల్లు
సెల్‌ఫోన్ ఐదేళ్ల క్రితం వరకు సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకే ఉపయోగపడేది. ప్రస్తుతం ఈ ఫోన్ మరిన్నో సేవలను అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పేపర్, మొబైల్ టీవీ... ఇలా వివిధ రకాలుగా రూపాంతరం చెందుతోంది. తాజాగా విద్యుత్తు శాఖ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తుకు సంబంధించిన వివరాలను సెల్‌లో చూసుకునే వెసలుబాటు ఏర్పడింది. సీపీడీసీఎల్ అధికారులు జెనీవా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌తో కలిసి ఎస్.ఎం.ఎస్. ద్వారా విద్యుత్తు సంబంధిత సమాచారాన్ని వినియోగదారులకు అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సొంత భాషలో మెసేజ్‌లు పంపే సదుపాయం కల్పించింది. సీపీడీసీఎల్ ద్వారా సెల్‌ఫోన్ ఉన్న విద్యుత్తు వినియోగదారులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా బిల్లు వివరాలు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం వినియోగదారులు ముందుగా తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా విద్యుత్తు బిల్లు పంపడంతో పాటు, బిల్లు చెల్లించిన వెంటనే 'ధన్యవాదాలు' అంటూ సమాచారం పంపుతారు. వినియోగదారుడు ఉంటున్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో ఏమైనా అంతరాయాలుంటే ఆయా వివరాలూ పంపిస్తారు. ఇందుకు వినియోగదారుడికి అదనంగా ఎలాంటి ఛార్జీ పడదు. ఈ సేవలను మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేశారు. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు.
మొబైల్ వినియోగదారులు తమ విద్యుత్తు సర్వీసు నంబరు, ఈఆర్ కోడ్‌ను కంపోజ్ చేసి, 57333 నంబరుకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెట్ అందుబాటులో ఉండే వినియోగదారులు www.apcentralpower.com వెబ్‌సైట్‌లో 'మొబైల్ అలర్ట్స్' అనే లింక్‌లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడ కోరిన సమాచారాన్ని అందజేసి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు

0 Responses to "సెల్‌లో విద్యుత్తు బిల్లు"
Post a Comment