శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యానికి నష్టపరిహారం
శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యం ప్రదర్శించినందున చోడవరం ప్రాంతానికి చెందిన వైద్యుడొకరు రూ.50 వేలు నష్ట పరిహారంతోపాటు వైద్య ఖర్చులకు పది వేలు, మరో పది వేలు ఖర్చులకు ఫిర్యాదికి చెల్లించాలని విశాఖపట్నం జిల్లా వినియోగదారుల ఫోరం- 1 అధ్యక్షుడు వై.ఢిల్లీశ్వరరావు తీర్పు చెప్పారు. బాధితుడు ముమ్మిడిశెట్టి కృష్ణ ఈనాడుకు అందించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రావి కమతంలో గతంలో ముమ్మడి శెట్టి కృష్ణ ఉండేవాడు. ఆ సమయంలో అతని జననేంద్రియాల వద్ద ఇబ్బందిగా ఉండటంతో చోడవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ కె.సుందర్‌రామాన్ని సంప్రదించాడు. బాధితుడిని పరీక్షించిన ఆయన చిన్న శస్త్రచికిత్స అవసరమని, దీనికి రూ.1000 చెల్లించాలని తెలిపారు. బాధితుడు ఫీజు చెల్లించిన పిదప డాక్టరు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇది పూర్తయిన తర్వాత అతనికి మరింత ఇబ్బంది కలగటంతో డాక్టరును తిరిగి సంప్రదించాడు. సుందరరామం పరీక్షించి వైద్య చికిత్స చేసినా ఫలితం లేకపోవటంతో బాధితుడు నగరానికి చెందిన డాక్టర్ బి.రాంబాబును సంప్రదించారు. మొదట జరిగిన శస్త్ర చికిత్సలో తలెత్తిన మైనరు లోపాన్ని రాంబాబు సరిదిద్దారు. శస్త్ర చికిత్సలో జరిగిన నిర్లక్ష్యానికి నష్టపరిహారం కోరుతూ బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరం-1లో కేసు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం-1 అధ్యక్షుడు వై.ఢిల్లేశ్వరరావు పై తీర్పు ఇచ్చారు
0 Responses to "శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యానికి నష్టపరిహారం"
Post a Comment