రిలయన్స్ నష్టపరిహారం ఇవ్వాల్సిందే!
విద్యుత్ సరఫరా చేయని కారణంగా పంట దెబ్బతిన్న ఓ రైతుకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. రిలయన్స్ సంస్థ అధీనంలోని బీఎస్ఈఎస్ కంపెనీని ఆదేశించింది. విద్యుత్ సరఫరాకు అవసరమైన స్కిరల్ కండక్టర్ అనే విద్యుత్ తీగ అపహరణకు గురైనట్టుగా సంబంధిత రైతు ఫిర్యాదు చేసినందున, కొత్తగా ఆ కండక్టర్‌ను తెచ్చి వేసి విద్యుత్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత బీఎస్ఈఎస్‌పై ఉందని కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ జేడీ కపూర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందర్‌సింగ్ గహలౌట్ 8 నెలలుగా విద్యుత్ సరఫరా లేక చాలా ఇబ్బందులు పడ్డాడని, తనకు సరఫరా జరగడం లేదని ఫిర్యాదు చేసినా కంపెనీ పట్టించుకోలేదని, అందువల్ల కంపెనీ తన సేవల్లో లోపం జరిపిందని కమిషన్ తీర్మానించింది.
0 Responses to "రిలయన్స్ నష్టపరిహారం ఇవ్వాల్సిందే!"
Post a Comment