తప్పుడు సమాచారంతో పొందిన బీమా క్లెయిమ్స్
మోసంతో కాని, తప్పుడు సమాచారంతో కాని పొందిన బీమా పోలసీ క్లెయిమును చెల్లించకుండా బీమా కంపెనీ తిరస్కరించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తప్పుడు సమాచార విషయం రుజువైన పక్షంలో అసలు పోలసీనే రద్దుచేయవచ్చునని జస్టిస్ ఎస్బీ సిన్హా, జస్టిస్ హెచ్ఎస్ బేడీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేరళకు చెందిన చాకోచాన్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన కుటుంబీకులు ఎల్ఐసీ పాలసి క్లెయిము చేశారు. పాలసీ తీసుకున్న ఆరునెలలకే ఆయన మరణించారు. తనకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగిందన్న విషయాన్ని పాలసీ తీసుకున్న సమయంలో ఆ ఇంటియజమాని దాచి పెట్టారని, దరఖాస్తులో దానికి సంబంధించిన చోట 'నో' అని పేర్కొని తప్పుదోవ పట్టించారని క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించడంతో వివాదమైంది. కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పాలసీదారు కుటుంబానికి అనుకూలంగా, అప్పీలులో బహుళసభ్య ధర్మాసనం ఎల్ఐసీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఇప్పుడు సుప్రీం.. హైకోర్టు డివిజన్‌బెంచి తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వు జారీచేసింది.
0 Responses to "తప్పుడు సమాచారంతో పొందిన బీమా క్లెయిమ్స్"
Post a Comment