చిట్‌ఫండ్ సవరణ బిల్లు ఆమోదం
1971 నాటి చిట్‌ఫండ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. చిట్‌ఫండ్ కేసులను సివిల్ కోర్టుల పరిధి నుంచి తీసివేసి రిజిస్ట్రార్‌లకు బదలాయించడం ఈ సవరణ లలో ఒకటి. చిన్నమొత్తాల్లో చిట్‌లు కట్టేవారిని రక్షించడం కోసమే చట్టంలో సవరణలు తెస్తున్నామని మంత్రి రత్నాకరరావు అన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలను తీసుకునే సవరణలు చేశామని, తాము కొత్తగా ఏమీచేయలేదని చెప్పారు. దీని ప్రకారం ఇక నుంచి లక్ష రూపాయల చిట్‌కు 50 శాతం డ్రాఫ్టు రూపంలో, మిగిలిన 50 శాతం బ్యాంకు నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కోర్టుల్లో మూడు వేల చిట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు అధికారులను నియమిస్తున్నామని, శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు.
0 Responses to "చిట్‌ఫండ్ సవరణ బిల్లు ఆమోదం"
Post a Comment