నీరుగారిన 'కిట్ల' పథకం!
తాగునీటిస్వచ్ఛతను నిర్ధరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం నీరు కారిపోయింది. మంచినీటిని విశ్లేషించేందుకు రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కిట్లు అటకెక్కాయి. వీటిని కొనటంలో కనపరచిన ఆత్రుత వినియోగించటంపై చూపటంలో ప్రభుత్వం విఫలమైంది.
తాగునీటి కాలుష్యంతో ఇరవై శాతం పైగా వ్యాధులు ప్రబలుతున్నట్లు తేలటంతో మంచినీటిని విశ్లేషించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోపంచాయతీలను భాగస్వాములుగా చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రాజీవ్‌గాంధీ తాగునీటి పథకం కింద నిధులను కూడా మంజూరు చేసింది. చేతి పంపులు, రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేసే నీటిని విశ్లేషించాలని పేర్కొంది. ఇందుకోసం 22 వేల గ్రామ పంచాయతీలకు నీటి విశ్లేషణ కిట్లను రెండు దఫాలుగా సరఫరా చేశారు. 2007లో తొలి విడత కింద కొన్న కిట్ ధర రూ.2,500 కాగా తరువాత దీన్ని రూ.2 వేలుగా నిర్ణయించారు. కిట్ల వినియోగంపై గ్రామ సర్పంచి, సైన్స్ ఉపాధ్యాయుడు, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. తరువాత దీని గురించి మరచిపోవటంతో ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన దాదాపు రూ.19 కోట్లు నీటి పాలయ్యాయి.
కిట్లు ఏం చేస్తాయి..
తాగునీటిలోని తొమ్మిది రకాల కారకాలను కిట్ల ద్వారా విశ్లేషించవచ్చు. సాంద్రత, ఆమ్లత్వం, కఠినత్వం, గాఢత్వం, క్లోరిన్, ఫ్లోరైడ్ స్థాయిని గుర్తించేందుకు ద్రావకాలను కూడా సరఫరా చేశారు. ద్రావకాల కాలపరిమితి ఏడాదిన్నర మాత్రమే. దీంతో కిట్లను వాడకుండానే వీటిని మూలన పడేసే పరిస్థితి నెలకొంది.
గ్రామస్థాయి విశ్లేషణలో నీటిలో కారకాలు ఉన్నాయని తేలితే వాటిని జిల్లాస్థాయి ప్రయోగశాలకు పంపాలి. అక్కడ నుంచి పది శాతం నమూనాలు రాష్ట్రస్థాయి ప్రయోగశాలకు రావాలి. ఇక్కడకు ఇంత వరకూ ఒక్క శాంపిల్ కూడా రాలేదని సమాచారం. ఈ విధానాన్ని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.
నీటిని విశ్లేషించే వ్యక్తికి ప్రతి నెలా రూ.100 గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినా, నిధులను మాత్రం విడుదల చేయలేదు. సైన్స్ ఉపాధ్యాయులైతే అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇచ్చారు. వీరిలో చాలా మంది బదిలీపై వెళ్లిపోయారు.
ప్రతి కుటుంబం నుంచి రూపాయి చొప్పున నిర్వహణ వ్యయం వసూలు చేయాలని తొలుత నిర్ణయించారు. చాలామందికి కిట్లు వచ్చిన విషయమే తెలియకపోవడంతో వసూళ్లు జరగలేదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచి దీనికి కేటాయించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.
పంప్ మెకానిక్‌లు గతంలో బాక్టీరియాకు సంబంధించిన పరీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారికే ఈ బాధ్యతలు అప్పగించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.
శుభ్రమైన మంచినీరు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా సరఫరా చేసే నీటిని పరీక్షిస్తామని చెబుతోంది. ఇది జరగాలంటే పంపిణీ చేసిన కిట్లను వాడుకోవాలి. గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారి సేవలను వినియోగించుకోవాలి. కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడినప్రయోగశాలలనూ పటిష్ఠ పరచాలి.

0 Responses to "నీరుగారిన 'కిట్ల' పథకం!"
Post a Comment