139 నెంబరుతో కాల్‌సెంటర్ రైల్వే సమాచారం
రైల్వేకు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం దక్షిణాది రాష్ట్రాలన్నిటి కోసం 139 నెంబరుతో కాల్‌సెంటర్‌ను రైల్వే ప్రారంభించింది. తమిళనాడు నుంచి ఈ కేంద్రం పనిచేస్తున్నా, నాలుగు రాష్ట్రాల పరిధిలో ఎక్కడి ప్రజలైనా కేవలం ఒక లోకల్‌కాల్‌తో తమకు కావాల్సిన సమాచారాన్ని రోజులో ఏ సమయంలోనైనా పొందే వీలుంది. అంటే 24X7 విధానంలో ఇది పనిచేస్తుంది. 'ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం' (ఐ.వి.ఆర్.ఎస్.)లోనే కాకుండా అవసరమైతే సిబ్బంది ద్వారా కూడా సమాధానాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రయాణికులు చేయాల్సిందల్లా ఏంటంటే కంప్యూటర్లో వినిపించే సులభమైన సూచనలను పాటిస్తూ పోవడమే. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విస్తారమైన సమాచారాన్ని ఈ కాల్ సెంటర్ అందిస్తుంది. సాధారణంగా రైళ్ల రాకపోకల వేళలు, బెర్తుల లభ్యత, పి.ఎన్.ఆర్. నెంబరు ఆధారంగా టికెట్ల తాజా స్థితి వంటివి తెలుసుకునేందుకు ఎక్కువమంది రైల్వే ఎంక్వయిరీకి ఫోన్ చేస్తుంటారు. 139లో ఇలాంటి వివరాలను ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా చిటికెలో ఇవ్వడమే కాకుండా వేరే స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది ద్వారా తెలియపరుస్తారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి పుణె వెళ్లే రైళ్ల గురించి విశాఖలోని ప్రయాణికుడు తెలుసుకోవాలంటే 139 నెంబరుతో సాధ్యమే. నాగ్‌పూర్ స్టేషన్లో ఏసీ డార్మిటరీ వసతి ఉందో లేదో రాజమండ్రి ప్రయాణికుడు ఇట్టే తెలుసుకోవచ్చు. ఆయా స్టేషన్లలో ఉండే వసతి సదుపాయాలు, ప్రయాణికులకు అందుబాటులో ఉండే వసతులు, వివిధ రాయితీలు, సర్క్యులర్ టికెట్లు... ఇలా రైళ్లకు సంబంధించిన ఏ సమాచారం కావాలంటే దానిని అందించేందుకు వీలుగా 'కస్టమర్ కేర్ కాల్ సెంటర్'ను తీర్చిదిద్దారు.
0 Responses to "139 నెంబరుతో కాల్‌సెంటర్ రైల్వే సమాచారం"
Post a Comment